విశ్వం - విశ్వాసం
విశ్వం - విశ్వాసం తల్లి ప్రేమలోని తీయదనం కొంటె చేష్టలతో కూడిన బాల్యం --- ఓ భరోసా క్రమశిక్షణతో కూడిన కటుత్వం హృదయంలోనే దాగిన తండ్రి అనురాగం---- ఓ నమ్మకం కఠిన పరీక్షల గురువు కషాయత్వం తట్టుకోగలిగితేనే దొరికే దిశానిర్దేశం- ఓ విధేయత విశ్వేశ్వరుని నామాన్ని కీర్తించడం లోని రుచి, అనుభవమైతేనే లభించే జీవన సాఫల్యం - ఓ విశ్వాసం నీ లోపాలను నీతోనే వెల్లడించే స్నేహంలోని వగరుతనం నీ అభివృద్ధిని కాంక్షించే నిష్కళ్మషతనం-- ఓ ఆశ పుల్లటి పరిస్థితులనే నిచ్చెన గా చేసుకొని, ఆత్మబలంతో తమ బలహీనతల పై తామే చేయాల్సి ఉంటుంది యుద్ధం--- ఓ అంగీకారం తల్లి, తండ్రి, గురువు, దైవం, సరియైన స్నేహం మీ మనోబలానికి, మీలోని అంతర్ శిశువుకు ఆలంబనం విత్తునీ, తమ వేర్ల(మూలాల)నీ మరవక విశ్వం పై విశ్వాసంతో సాగే వారికి విధి ఎప్పుడూ సానుకూలం విశ్వావసు లో విశ్వాన్ని నమ్ముదాం విశ్వాసాన్ని పెంపెంచుకుందాం విధేయతను అలవరచుకుందాం ఆశలను నెరవేర్చుకుందాం మన ఆత్మవిశ్వాసమే గురుత్వాకర్షణ యై విశ్వాన్ని మన చుట్టూ భ్రమింపచేసే విధంగా ఎద...

