నీ నుంచి నీ ఆనందాబుధిలోకి

You can Listen to this Kavitha in the above Audio. 

                               నీ నుంచి 

నీ ఆనందాబుధిలోకి


 సృష్టి మొత్తం అద్భుతమయితే 
అందులోని ప్రతీ అంశమూ అపురూపం,  
ఆనందానికి ప్రతిరూపం.

సృష్టి మొత్తం అద్భుతమయితే 
అందులోని ప్రతీ అంశమూ అపురూపం,
ఆనందానికి ప్రతిరూపం. 

ఎత్తైన పర్వతాలు మనం అధిరోహించాల్సిన 
అధిగమించాల్సిన భవిష్యత్తును సూచిస్తుంటే... 
సుందరమైన లోయలు శోధించాల్సిన సత్యాలకై 
నీలోకే  ప్రయాణించమంటుంటే... 

పచ్చటి పచ్చిక బయళ్ళు, 
బంగారు వర్ణపు ఇసుక తీరాలు.. 
ఇలా ఎన్నో ప్రకృతిని మాతగా ఆవిష్కరిస్తూ ఉంటే..

ఉవ్వెత్తున ఎగసిపడే సముద్రిడి ఘోష,
పుత్ర గాఢ పరిష్వంగనకై  ఆరాటపడే
 జనకుని భాషగా 
హృదయంలో  
విశ్వపితను కలిసిన 
పురివిప్పిన సంతోష కెరటాల 
భావతుంపరలు.

 ఉవ్వెత్తున ఎగసిపడే సముద్రిడి ఘోష
పుత్ర గాఢ పరిష్వంగనకై ఆరాటపడే
జనకుని భాషగా 
హృదయంలో  
విశ్వపితను కలసిన
పురివిప్పిన సంతోష కెరటాల 
భావ తుంపరలు...
 
మైపాడు సముద్ర తీరం గురించి, మైమరచి 
ఘనీభూతమయ్యే మనసును కాస్త కరిగిస్తే, కదిలిస్తే .....   

 పదేపదే పాదాలను 
ముద్దాడిన అలల వైనం
పదేపదే పాదాలను 
ముద్దాడిన అలల వైనం..

 విశ్వంలోను మనిషిలోనూ 
ఒకే శాతం నీటితో 
విశ్వేశ్వరుడు వేసిన జలానుబంధ వైచిత్రం

 విశ్వంలోనూ మనిషిలోనూ 
ఒకే శాతం నీటితో 
విశ్వేశ్వరుడు వేసిన జలానుబంధ  వైచిత్రం 

ఇసుకలో గోపురాలు కట్టే పిల్లలు
పసిపిల్లల్లో పిల్లలయి నీటిఆటలాడేఅమ్మానాన్నలు.

 సముద్రపు ఒడ్డున గుర్రపుస్వారీ అయినా 
అలలపై మరబోటువిహారమైనా
సూర్యోదయమైనా... సూర్యాస్తమయమైనా... 
దేనికదే సాటి 
దానికి లేదు వేరే పోటీ.

సముద్రపు ఒడ్డున గుర్రపుస్వారీ ఆయినా
ఆయినా అలలపై *మర బోటు* విహారమైనా
 సూర్యోదయమైనా సూర్యాస్తమయమైనా 
దేనికదే సాటి 
దానికి లేదు వేరే పోటీ.

 మసాలాగుగ్గిళ్ళు 
మిరపకాయ బజ్జీలు 
పుల్ల ఐస్ క్రీములు 
పీచు మిఠాయిలు 
ఒకటేంటి 
అందరికీ అందుబాటులో ఎన్నెన్నో అభిరుచులు

సముద్రపు హోరులో  ఊసులాడే 
కుర్ర జంటలు
బిడియాలు విడివడే 
 కొత్త జంటలు
 బాధ్యతలను మరచి 
ఆహ్లాదాన్ని అనుభవించే 
 నడి జంటలు 
తాత్వికచింతనలో మరి 
 మలి జంటలు.

 అంతేనా
అన్నివయసుల వారిని 
ఏకం చేసి కేరింత కొట్టించే సముద్రస్నానం 
అన్నివయసుల వారిని 
ఏకం చేసి కేరింత కొట్టించే సముద్రస్నానం 
అతి చిన్న అలక్కూడా అబ్బో 
ఇంత బలమా అని అబ్బుర పడుతూ

ఒడ్డుకు విసిరేస్తున్నా అలసిపోక  విసుగే లేక 
ఒడ్డుకు విసిరేస్తున్నా అలసిపోక  విసుగే లేక 
ఎదురెళ్ళి ప్రతీ అలతో మునకలు వేయించే 
చిలిపి కుర్రతనం

ఒడ్డుకు విసిరేస్తున్నా అలసిపోక  విసుగే లేక 
ఎదురెళ్ళి ప్రతీ అలతో మునకలు వేయించే 
చిలిపి కుర్రతనం

ఒడ్డున ఉన్న శంఖులు ఆల్చిప్పలు 
అందరికీ ఏరుకున్నంత.
ఒడ్డున ఉన్న శంఖులు ఆల్చిప్పలు
 అందరికీ ఏరుకున్నంత అయితే;
 
చేపలవేటకై
ఎఱలతో వలలతో జాలర్లు జోరు మీద ఉంటే..
చేపలవేటకై
 ఎఱలతో వలలతో జాలర్లు జోరు మీద ఉంటే; 
ఇక 
గర్భంలో ఉన్న మణిమాణిక్యాలను 
గర్భంలో ఉన్న మణిమాణిక్యాలను గాలించి 
సాధించగల సాహసులెవరా ఎక్కడా అనే కుతూహలం 

ఖండాలనే కలిపే మహాసముద్రాలతో మమేకం
ఖండాలనే కలిపే మహాసముద్రాలతో మమేకం
 అనేక భూమికలను పోషించే మనలోని వైరుధ్యాలను చేస్తుంది ఏకం .

మానసిక ప్రశాంతతో పాటు
ఆరోగ్యాన్నిచ్చే సముద్రపు గాలి
ఆటుపోట్లను ఎదుర్కొనే ఉత్సాహాన్నీ ఇస్తుంది తీసుకెళ్ళమని  తన గుర్తుగా.

మానసిక ప్రశాంతతో పాటు
ఆరోగ్యాన్నిచ్చే సముద్రపు గాలి 
తీసుకెళ్ళమని ఇస్తుంది 
ఆటుపోట్లను ఎదుర్కొనే ఉత్సాహాన్ని తన గుర్తుగా.

 డబ్బుతో పని లేకుండా 
దర్శనం తోనే అందరికీ 
ఆత్మానందాన్ని ఇస్తూ 
డబ్బుతో పని లేకుండా 
దర్శనం తోనే అందరికీ 
ఆత్మానందాన్ని ఇస్తూ 

అవిరామంగా అలలను తీరం చేరుస్తూ 
ఆదరంగా తిరిగి తనలోనికి తీసుకు వెళుతూ
అలసిపోని తరిగిపోని జలనిధి
అంబుధి.

 అంతా ఒకటిగా అంతటా తానే అయిన 
సృష్టి స్థితి లయలకు కారణమైన ఆ పరమాత్మకు ప్రతినిధి
అంతా ఒకటిగా అంతటా తానే అయిన 
 సృష్టి స్థితి లయలకు కారణమైన ఆ పరమాత్మునికి ప్రతినిధి..

Comments

Post a Comment

Popular Posts