నవతరం ఇంద్రియాలు
You can Listen to this Kavitha in the above Audio.
నవతరం ఇంద్రియాలు
అమ్మమ్మలు క్షీరసాగర మధనంలా
మజ్జిగ చిలుకుతూ భాగవత పద్యాలు వల్లించినా,
తాతయ్యలు పురాణ గాధలు
పక్కలో పడుకోబెట్టుకుని వినిపించినా...
అరే! పిల్లలు ముందు ఐదుఏళ్ల వరకూ ఆడుతూ పాడుతూ
ఆటల బడిలోలా గడించిన జ్ఞానం
జీవితంలోని అన్ని ఆశ్రమాలకూ ఆసరాగా నిలిచేది.
నాలుగు పురుషార్ధాలకూ పునాదిగా భాసిల్లేది.
వెనుకటి తరాల ముందు మాట ఇది.
అత్తా బాబాయిలు, అన్నాచెల్లెళ్ళు
ఒంటరితనం అంటేనే తెలియని ఉమ్మడి కుటుంబ కాలం.
నిస్పృహ నిరాశా వాదాలకు చోటే లేదు సరికదా,
పెద్దవారి సూచన సలహాలకు మించి
కౌన్సిలింగ్ అవసరమే లేని మధురమైన స్వర్ణయుగం.
" నాన్నలుఅమ్మలు " అప్పుడు
నిజ్జెంగా నాన్నలు అమ్మలే కానీ దోస్తులు కారు.
ముద్దు చేసినంతగానూ మందలించే వారు.
ఎక్కువ బోధించకుండా ఉదాహరణగా నిలిచేవారు.
ఇక పెద్దన్నల, అక్కల మాటకొస్తే...
పెద్దరికం-బాధ్యతలను, తమ్ముళ్లను-చెల్లెళ్లను
సంతోషంగా మోసేవారు.
నేస్తాలను మరిపించేవారు.
చదువులకు ఆట విడుపైన పండుగలు-పబ్బాలు
మరింత కేరింతలతో అమ్మ చేతి రుచులతో
ఎన్నో మధురజ్ఞాపకాలకు ఆలంబనాలు.
మరింక స్నేహితులతో పంచుకునేవి అప్పచ్చులు ఆటలే.
చూ...మ్... మంత్రం అన్నీ మాయం
బెడ్ టైమ్ స్టోరీస్ మీట నొక్కుతూనే తయారు
పాటలు కథలు బొమ్మలతో సహా
సెలవల్లోనూ సమ్మర్ క్యాంప్స్
గ్రాండ్ పేరెంట్స్ తో గ్రేట్ అంటూ స్కైప్ లో ముచ్చట్లు
ఎప్పుడో ఏదైనా శుభకార్యాలకు కలిస్తే
హాయ్ కంటే ముందుకెళ్ళని ఆత్మీయ సంబంధాలు
వరసలు కూడా అర్థం కాని బంధుత్వవైనాలు.
వందల్లో వేలల్లో ఫేస్బుక్ ఫ్రెండ్స్
మనసారా మాట్లాడుకోవడానికి
కడుపారా నవ్వుకోవడానికీ
కష్టం సుఖం పంచుకోవడానికి
ఆధారమే కాదు
ప్రాణవాయువు అయిన వాట్సాప్ !
అమ్మ నాన్న ఉంటే మరొక్క తోబుట్టువు
నిజమే అనుబంధం మరింత దృఢంగా చిక్కగా ఉండవచ్చు
ఏదో సంఘర్షణ! ఎవరిని దరిచేరనివ్వదు.
ఆత్మీయ స్పర్శ దివ్యౌషధంఅని
ఎరుగకుండా చేసే దూరపు కొండలు.
మనం అంటే తెలియనివారే
ఊరట అనుకునే తెలివితక్కువతనం.
అయ్యో! నేను ఆధునికతకూ
నూతన ఆవిష్కరణలకూ వ్యతిరేకంకానే కాదు.
ఎన్నో మైళ్ళ దూరంలోవున్న
ఏమారిన బంధాలను దగ్గరకు చేర్చి
క్షణాల్లో నా ఈ మాటలను మీకు చేరవేసే
ఈ పనిముట్లకు ఎంతో రుణపడి ఉన్నా.
వాటికి మన ఇంద్రియాలంత గౌరవాన్ని ఆపాదిస్తున్నా
'గీత'లో కృష్ణుడు లా నువ్వు రౌతువి అని నీకు గుర్తుచేస్తున్నా.
లోకంలో ఆనందించు.
అదేలోకంగా జీవించ వద్దు.
ప్రతిబింబాలు ఎన్ని ఉన్నా, ఒకటైన.. శాశ్వతమైన..
సనాతనమైన.. సత్యాన్ని గుర్తించమంటున్నా🙏🏻
Published in SAMACHARAM - Telugu Daily Paper from RAJAMAHENDRI - Dated: 19-04-2015


Entha baga rasevo. Super jaya.
ReplyDeleteThanks
DeleteNice amma! Post more ❤️
ReplyDeleteThanks Srav,😍
DeleteVery well written 👍 waiting for more 😊
ReplyDeleteThanks 🙏
DeleteWell presented thoughts Jaya🙏👌True . We live in a world of tech than human relations and to balance. Keep the good work👏🤛
ReplyDeleteThanks Padma 🙂
DeleteSuperb jaya. Chala correct ga cheppavu
ReplyDeleteThank you 😊
DeleteSuperb atta! Would be eagerly waiting for more from you ♥️😍🤩
ReplyDeleteThanks Munny😊
DeleteYou surprise me always attha. 😊 Super talented ...Thanks for such a nice write up .. will be waiting for more ... Of your written creativity. All the best..👍🥰
ReplyDeleteThank you Sujji,😊
ReplyDeleteNice athaya😍 chala baga cheppavu
ReplyDelete