నేను - నా బంగారు భుజము
Please Click the above Audio link to listen the below article.
నేను - నా బంగారు భుజము
50 సంవత్సరాల కాలం భలే గమ్మత్తుగా తెలియకుండా గడిచిపోయింది కానీ, ఆ తర్వాత నుండి అనుక్షణం గుర్తుండిపోయేలా చేస్తోంది నా బుజ్జి ఎడమ భుజం. శరీరంలో దీనికి అంటూ ప్రత్యేక హోదా తానే సొంతంగా కల్పించుకుంది. పోనీలే పాపం అని ఏదో కొంచెం చూసి చూడనట్లు ఊరుకున్నా రెండు నెలలు. అలిగింది. నా భుజం అలక నేను కాకపోతే ఎవరు తీరుస్తారు అని మణిపాల్ మందేసా. ఆక్యుపంచర్ నూ ఆనందంగా హాయిగా చేయించుకున్నా. అయినా మారం మానలేదు. సర్లే అని పద్మ వదిన గారం చేస్తూ గుళికలు, లేపనాలు, తైలాలుతాయిలంగా ఇచ్చింది. వింటేనా? ఇలా కాదు అని కషాయాలతో, మర్దనాలతో అదరించి బెదిరించాను. నా మందలింవులన్నీ చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లు గా నన్ను లెక్కచేయక, "అడిగింది ఇవ్వకపోతే ఇల్లు పీకి పందిరేసే పెంకిపిల్లలా" ఒకటే ఆగం, నస. లాభంలేదని మా పెద్ద కోడలు బాల ఇచ్చిన యోగ దండాన్నీ ప్రయోగించాను. సామ, దాన, భేద, దండోపాయాలేవీ పని చెయ్యలేదు.
కానీ, నా భుజాన్ని నేను ఎప్పుడూ కసురుకోలేదు. మరింతగా ప్రేమించడం మొదలుపెట్టాను. నిజంగా ఇది బంగారు భుజం అని భుజకీర్తి తగిలించవచ్చు. ఎందుకంటే ఇది పెళ్లిళ్లు చేయించింది. నా చేత కవితలు, కబుర్లూ చెప్పిస్తోంది. యాత్రలకు అడ్డు రావట్లేదు. ఆరోగ్యకరమైన నడకనూ మళ్ళీ నాది చేసింది.
ప్రాతఃస్మరణీయులు అయిన పెద్దలను రాత్రంతా అమ్మా-నాన్నా అని కలవరించేలా చేయడమేకాక దివారాత్రులు అనే తేడా లేకుండా అనుక్షణం భగవంతుడిని మరచిపోకుండా మరింత దగ్గర చేసింది. నా కొత్త కథాకళీలు చంద్రాకు నిద్రా భంగం కలిగిస్తే, అమ్మ గురించి ఆలోచించేలా నా పిల్లల్నీ తయారుచేసింది.
అంతటితో కధ ముగిస్తే మలుపులు మజా ఏముంది? ఏదో కూసింత ఊరట కోసం ప్రాణ స్నేహితుల ముచ్చట్లతో మైమరుద్దాం అనుకుంటే నాకంటే ముందుగా దానికే పలకరింపులు. భుజం ఎలా ఉంది అంటూ. వారందరికీ ఇదో పేద్ద చర్చనీయాంశమై, ఎన్నో సంవత్సరాలుగా నా మీద పేరుకున్న కసి అంతా నన్నో నేరస్తురాలిగా, నా భుజం మీద సానుభూతితో కలగలిపి కబుర్లు చెప్పేవారు. ఎప్పుడూ ఫోన్ చెయ్యనివారు కూడా చేసి మనం ఇంకా చిన్న పిల్లలం కాదు."ఇది చెయ్యకు. అది చెయ్యి. రెస్ట్ తీసుకో" అంటూ ఉచిత సలహాలతో ఊపిరి సలపకుండా రచ్చ రచ్చ చేసేసారు. ఏదోలే వారి అభిమానం అని Lightగా తీసుకున్నా. వాళ్ళు అరచినా కరచినా నాకే సొంతం అయినవాళ్లు కదా మరి.
నిజం చెప్పొద్దూ! నేను నా నొప్పిని చాలా Enjoy చేశాను. దీని ముద్దు ముచ్చట్లను మురిపెంగానే భావిస్తున్నా. ఇది నేర్పేపాఠాలను ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను దీనికి నూనె రాసి, వేడి వేడి నీళ్ళు పోసి చిన్నప్పుడు పిల్లలను బజ్జో పెట్టినట్లు పడుకో పెడుతున్నా.
అదుగో ఓ శుభ ఘడియన నాకూ ముహూర్తం కుదిరింది. Mayo Facial Trigger Firing అని Dr Kannan, గారి Treatment కు బయలుదేరా. It Sounds Something Fancy, isn't it? Exhibition లో Balloons Burst చేసే Rifle ఆటలా తోచింది. పాపం వాళ్ళు నా భుజబాధలకు ఫ్రోజెన్ షోల్డర్ అనే నామకరణం చేశారు. ఇంత Suspense పిల్లల పేర్లకూ కష్టపడలేదు. అసలు అదే పెద్ద రిలీఫ్ ఇచ్చింది. Yes now I can tell Everybody at least what my problem is. Google Search లూ చకచకా సాగాయి. మంకుతనంతో
బిగదీసుకుంది అనుకున్నా కానీ ఇది మంచులా బిగుసుకు పోతోంది అని తెలుసుకున్నాక, ఇంకేముంది? నేను వేరు నా శరీరం వేరు అని ఊరికే థియరీ గా వినే వేదాంత పాఠాలను ప్రాక్టికల్గా, మర్చిపోయిన Maths Angles ను ట్రీట్ మెంట్ లో భాగంగా నేర్చుకున్నా. శిబి చక్రవర్తి లా నాభుజాన్ని వాళ్ళకి దారాదత్తం చేసేసాను. అద్దం చూసుకుంటే ముఖం మాటే మర్చిపోయి భుజం ఎంత ఎత్తగలనో చూసుకుని మురిసి పోతున్నా. Bear pain to heal , అనే కొత్త సూత్రాన్ని కనిపెట్టాను.
Joy is Everything whatever comes in life not part of life. అనే సిద్ధాంతానికి పేటెంట్ తీసుకున్నా. ఇదుగో ఇప్పుడిప్పుడే పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి. నా స్కూటీ రథం మీద త్వరలో ఊరేగాలని ఉవ్విళ్ళూరుతున్నా. నా Exercise Session లో భాగంగా నన్ను మళ్లీ పాపని చేసి బాలు ఎగరేయడం, Catch పట్టుకోవడం ఇలా రకరకాల ఆటలు ఆడిస్తున్నారు. మరో నెల ఇలా ఆటవిడుపు.
ఉంటా మరి.
ఆటకి వేళయ్యింది.
జయ
ముఖ్య గమనిక : ఇది నేను 2015 సంవత్సరంలో రాసినది. ఇప్పుడు నాకు ఎటువంటి భుజ బాధలు లేవు. కథ సుఖాంతం అయినది అని చెప్పడానికి సంతోష పడుతున్నాను😃🙏🏻



Nice one! Wrote about pain in such a light and funny way 👍🏻
ReplyDeleteThank you Sravya 😍
DeleteNice way of seeing the positive outlook even in a painful time. Nicely written :)
ReplyDeleteThank you Sasank😍
DeletePain is also a part in life, nicely written atta 😍😊
ReplyDeleteThank you Munny😍
DeleteI can totally relate to the article.. attha 😀our attitude towards the pain.. and enjoying the healing process is what important. Asusual enjoyed your witty write up attha.. 👍😊
ReplyDeleteThank you Sujji😍
Deleteబాధను కూడా ఎంత బాగా సహించావో,నీ దైన భాష లో బాగా తెలియచేశావు అక్క.👌
ReplyDeleteబాధ మాట పక్కన పెట్టలేం. కానీ చదువుతున్నాను....నవ్వు కుంటున్నాను. చాలా చాలా బాగా బాగా వ్రాసావు. అక్షరాలు పొందిక ఎంతగా ఒద్దికగా కుదిరాయో హాస్య రసం అంతలా ఇమిడిపోయింది. చివరికి సుఖాంతం అయ్యింది. మాకు ఊరటగా వుందంటే నమ్ము. నెప్పి ఫీల్ అవుతూనే వున్నా నాకే అన్నట్లు. బహు బాగుంది
ReplyDeleteThank you ☺️🙏
Delete