దైవం Vs అమ్మ

You can Listen to this Kavitha in the above Audio.


దైవం Vs అమ్మ


అండపిండ బ్రహ్మాండాలనూ తనలో ఇముడ్చుకున్నది దైవమైతే

తన గర్భంలో ఊపిరిపోసుకున్న పిండాన్ని ప్రేగుతో ప్రేమగా ముడివేసుకునేది."అమ్మ

 

పదునాలుగు భువనాలనూ పోషించి భరించేది నారాయణుడైతే

తొమ్మిది నెలలూ అపురూపంగా

తన మాతృత్వాన్ని ధరించి సంరక్షించుకునేది " తల్లి "

 

తన వారికి అమృతాన్ని అనుగ్రహించి గరళకంఠుడైనది శంకరుడైతే

పురిటి నొప్పులు భరించి

జీవామృతాన్ని క్షీరధారలుగా అందించేది " మాతృమూర్తి ”.

 

అయితే.

అనునిత్యం ప్రవహించే దయామయుడి కృపే మనలోని చైతన్యం అని మనం ఎఱగం. గుర్తించలేం.

గర్భస్థజీవీ తనకు ఆధారం, ఆహారం అయినది మాతృదేవతే అని గ్రహించలేదు.

 

కళ్ళుండీ అజ్ఞానాంధకారంలో లో మ్రగ్గే మనకై దివ్య జ్యోతిరూపుడై వెలిసినది సూర్యభగవానుడైతే

 కళ్ళు మూసుకునే వున్నా, మాయలో వున్న శిశువుకు వెలుగు చూపే ప్రేమమయి జనని"

 

ఈశ్వరసృష్టిలోని జీవాలం మనం అందరం.

అమ్మ దృష్టిలో ఎప్పటికీ ఎదగని చిన్నారులం.

 

పాప పుణ్యాలంటూ మనని దండించక తప్పదంటాడు🙏 కాలుడు .

గుణగణాలెంచక బేషరతు ప్రేమకు పాతృడే నా బిడ్డ అంటుంది "తల్లి”

 

అందుకే.

అమ్మ దేవునికన్నా మిన్న అయ్యింది

ప్రత్యక్ష దైవమై ఇంటింటా కొలువైంది

సకల దేవతా స్వరూపమైంది

 

సహనానికి మరో రూపమైన అమ్మకు స్మృత్యంజలి

 

కుమార్తె

శ్రీమతి చన్నాప్రగడ జయలక్ష్మి

Published in SAMACHARAM - Telugu Daily Paper From RAJAMAHENDRI Dated 9th June 2015

Comments

Post a Comment

Popular Posts