నలభీమపాకాలు
నలభీమపాకాలు
ఆదివారం ఆడవారికి ఆటవిడుపు
నలభీమపాకాలతో వారికి మేలుకొలుపు.
గాజుల గలగలలులేక ఈ ఆదివారం
ప్రతి ఇంట్లో పాకశాలలు మూగబోయాయి.
అయితేనేం
హేమాహేమీలు పోటాపోటీగా వంటలు చేసి
ఆడవాళ్ళ మది గెలుచుకున్నారు.
హృదిలోవారి స్థానాన్ని మరింత పదిల పరుచుకున్నారు.
ఆదివారం ఆడవారికి
ఆటవిడుపు
నలభీమపాకాలతో వారికి మేలుకొలుపు.
అవి కొంత మందికి చిరకాల స్మృతులు.
మరికొందరికి నిత్యకృత్యాలు.
ఒకరిద్దరికి అదో సరదా అచ్చట.
యాంత్రిక జీవనంలో వైరుధ్యం ఓ ముచ్చట.
స్వాగతించిన ఎర్రగులాబీ
పూసింది తిరిగి అతిథుల చెక్కిలి జిలేబి
స్వాగతించిన ఎర్రగులాబీ
పూసింది తిరిగి అతిథుల చెక్కిలి జిలేబి.
సూపు రుచి,
అందించిన
చేతి వలన రెట్టింపయింది.
శ్రీకృష్ణ ఖాతాలో స్కోరు
బోణీ
అయ్యింది.
ఆరోగ్యానికి మేమే మొదలు అంటూ
కూరగాయల-పండ్ల సలాడు
భోజనాల బల్లనంతా ఆక్రమించుకుంది.
పళ్ళెంలోకి ముందుకు ముందుకు తోసుకొచ్చింది.
ఆదివారం ఆడవారికి ఆటవిడుపు
నలభీమపాకాలతో వారికి మేలుకొలుపు
ఇక వెరైటీ రుచులకు వస్తే ఏం లేదని చెప్పను?
ప్రేమ-ఆప్యాయతల కలగలుపు తాలింపు
ఘుమఘుమల కొత్తిమీర నడుమ వడ్డించిన మేళవింపు.
ప్రతీది అమృతమయమైంది
తినడానికి ముందే ఉదరం పరిపూర్ణమైయ్యింది.
అక్కడ ప్రతిదీ అమృతమయమయ్యింది
తినడానికి ముందే మా ఉదరం పరిపూర్ణమయ్యింది.
గుత్తి వంకాయే కాదే భామా వంకాయ తో ఎలాగైనా
ఎన్నయినా రుచులను రంగరించ వచ్చు
అందరినీ మెప్పించవచ్చు
నోట్లో నీరూరిస్తూ కరగిపోయి
కమ్మదనానికి మారుపేరుగా, సాంప్రదాయంగా
చంద్రా వంకాయ కూర నిలిచింది
భేషజాలకు తావులేని
అమ్మ చేతి వంటలా….. స్వచ్ఛత గా
ఆదివారం ఆడవారికి ఆటవిడుపు
నలభీమ పాకాలతో వారికి మేలుకొలుపు
మనిషి తోటే అభిరుచులూ
దేశాలన్నీ చుట్టముడుతున్న ఈ రోజుల్లో
ఇంకా సౌతు నార్తు తేడా లేంటని,
శ్రీకృష్ణ తవా పులావు అనేక రంగులతో
ఆకర్షణీయంగా ఒయ్యారం గా నిలిచింది.
కంచానికి అందం తెచ్చింది.
పెర్ఫెక్ట్ ప్రొఫెషనలిజంకు గుర్తుగా
సరైన పాళ్ళతో మసాలా గిట్టని వారిని కూడా
అది దాసోహం చేసుకుంది.
ఆదివారం ఆడవారికి ఆటవిడుపు
నలభీమపాకాల తో వారికి మేలుకొలుపు
వయసులోనే చిన్న
నేను ఎన్నుకున్న ఐటమే అన్నిటికన్నా మిన్న.
దమ్ ఆలూతో చక్రి పులావుకు ఆసరా ఇచ్చాడు
జీడిపప్పు గ్రేవీతో, ఎన్నో రకాల ప్యూరీలతో
ఆధరువుకు వన్నె తెచ్చాడు.
జఠరాగ్నిని శాంతింపజేసి నిండుదనాన్ని ఇచ్చాడు.
ఆదివారం ఆడవారికి ఆటవిడుపు
నలభీమపాకా లతో వారికి మేలుకొలుపు
పప్పులేని తెలుగు భోజనము
ఊహించగలమేమో కానీ తినలేము.
నయనానందకరమైన ఆకారం,
ముద్ద ముద్దలోనూ దానికి దీటుగా సాకారం,
పప్పు అంటే ఇంక ఎలాగూ ఉండడానికి వీలేలేదు
అన్నట్లు అత్యున్నత ప్రమాణాలతో
ఠీవిగా నిలబడింది శ్రీకాంత్ టమాటొపప్పు.
రెసిపీ కోసం మమ్మల్ని అందర్నీ కట్టించింది క్యూ.
ఆదివారం ఆడవారికి ఆటవిడుపు
నలభీమపాకాలతో వారికి మేలుకొలుపు
భోజనం అంటే నాలుగు వేళ్ళూ లోపలికి వెళ్లాలి
లొట్టలు
వేస్తూ అప్పడాలతో లాగించాలి
భోజనం అంటే నాలుగు వేళ్ళూ లోపలికి వెళ్లాలి
లొట్టలు వేస్తూ అప్పడాలతో లాగించాలి
అంటే సాంబార్ కావాల్సిందే మరి
ములక్కాడ మజాలతో
నేను ఒక్క చేత్తో అనాయాసంగా చేసైగలనని నిరూపించాడు హరీష్
ములక్కాడ మజాలతో
నేను ఒకే చేత్తో అనాయాసంగా చేసెయ్యగలనని నిరూపించాడు హరీష్
ఔరా! అని అందరం ముక్కు మీద వేసుకునేలా ముచ్చట పరిచాడు.
ఆదివారం ఆడవారికి ఆటవిడుపు
నలభీమపాకాలతో వారికి మేలుకొలుపు.
పంచభక్ష్య పరమాన్నాలున్నా
పెదవి విరిచి అబ్బే అదేం భోజనం?
అని సులభంగా అనేస్తారు.
తెలుగువాడి నోట ప్రశంసల జల్లు కురవాలంటే
తాజా చెట్ని తప్పనిసరి
టమాటా చట్నీ తో తన అనుభవసారాన్నీ
ఎవరికీ తీసిపోని విధంగా
శర్మ బావ అందించాడు.
ఆఖరిగా అందరినీ
బ్రేవ్ మని తేనించాడు.
ఆదివారం ఆడవారికి ఆటవిడుపు
నలభీమపాకాలతో వారికి మేలుకొలుపు.
ఆహా ఏమి రుచి!
తినగా మైమరచి
ఏమని చెపుదుము మా భాగ్యం!
మళ్ళీ ఇలాంటి ఆదివారం ఎప్పుడెప్పుడా అని
భుక్తాయాసంతో భారంగా అంతా వెనుతిరిగాం.
3rd January 2016, The day of the Feast.



Yummy! Nice one ☺️
ReplyDeleteChala baga rasavau atta
ReplyDeleteThanks Munny 😀
Delete