దివ్య మానసమ్ (Part-4)

 You can Listen to this Article in the above Audio

దివ్య మానసమ్

(Part-4)



శివ సంకల్ప సూక్తమ్

మంత్రం : 3

 

యతో ప్రజ్ఞానముత చేతో ధృతిశ్చః

యజ్యోతిరంతరమృతం ప్రజాసుః

యస్మాగ్నఋతేకించన కర్మక్రియతేః

తన్మే మనః శివసంకల్పమస్తు

 

బుద్ధికి ఆధారభూతమూ, ప్రజ్ఞాన రూపములో సూక్ష్మాతి సూక్ష్మమైనది. సకల జీవరాసులందు ఒదిగి ఉండేది. ఏది లేకపోతే చిన్న కార్యమూ జరగదో, అటువంటి మనస్సు శుభ సంకల్పములను కలిగి వుండు గాక

మనం యాంత్రికంగా ఎన్నో పనులను చేస్తూ వుంటాం. ఎంత గాఢనిద్రలో అయినా మనస్సు పూర్తిగా అచేతనమవదు. ఎంతో కొంత శరీరంతో అనుసంధానమై ఉంటుంది. అందుకే మనం మంచం మీద నుండి దొర్లిపడం, నిద్రలోనైనా మన పేరు వినబడగానే లేస్తాం.

ధృతి అంటే పట్టుదల. భగవద్గీతలో దీనిని మూడు రకాలుగా వర్ణిస్తాడు సాత్విక, రాజసిక మరియు తామసిక ధృతి. మన లక్ష్యాన్ని బట్టి మన ధృతిని నిర్ణయించగలం. అన్ని సందర్భాలలోనూ శరీరము, ఇంద్రియాలు అలసిపోయినా అడ్డంకులు ఎదురైనా మంచి ప్రయోజనాన్ని ఆశించి, గమ్యాన్ని చేరేవరకు సరియైన దృక్పదాన్ని విడువకుండా వుండటం సాత్విక ధృతి అన్పించుకుంటుంది. బయట వ్యవహరిస్తున్నప్పుడు ఎంతో ఓర్పు అవసరం. మన మనస్సుని నియంత్రణలో వుంచడానికి సత్యాన్ని గ్రహించడానికి మరింత ఓర్పు, పట్టుదల కావలసి వుంటాయి. నమ్మకం కలిగి ఉంటే మనం దృక్పధాన్ని విడువకుండా వుండగలం.

మన చేతులు పనిని చేస్తున్నాయో మన మనస్సునీ అక్కడే ఏకాగ్రం చేయాలి మన సంకల్పానికి కట్టుబడి ఓర్పుగా వుండగలాలి. శరీరానికి ఏదైనా సమస్య వస్తే జాగ్రత్తపడతాం. కానీ మనస్సుకు సమస్య వస్తే వెంటనే చర్య తీసుకోం. దానికి మనం ఎంతో శ్రద్ధ ప్రాముఖ్యతని ఇవ్వాలి.

భౌతిక సుఖాల లక్ష్యం రాజసిక ధృతి. ప్రయోజనాన్ని ఆశిస్తూ తప్పుడు నమ్మకాలతో కూడిన లక్ష్యం తామసిక ధృతి అన్పించుకుంటుంది.

తప్పుడు జ్ఞానం మనని సరిగా ఆలోచించనీయదు. సరిగా ఆలోచించి తప్పొప్పులు విచారించే వివేకము లేనివారు సత్యాన్ని ఎప్పటికీ గ్రహించలేరు

అంతర్ జ్యోతి స్వరూపము పూర్ణ చైతన్యము అయిన మనస్సు అన్ని జీవరాసులలోనూ నిక్షిప్తమై ఇంద్రియాలన్నిటిపై కాంతిని ప్రసరింపజేసి చైతన్యవంతం చేస్తోంది.

మనస్సు యొక్క మరియొక ప్రత్యేకత దాని అమరత్వం. అది జన్మజన్మలగా దాని సాన్నిధ్యాన్ని మనకు అందిస్తూనే ఉంది. అందుకే గత జన్మలను తెలుసుకోగలుగుతున్నారు. గర్భంలో ఉన్న శిశువు మనసూ పనిచేస్తూనే వుంటుంది.

కార్యాన్నైనా నెరవేర్చడానికి కావలసినది శరీరం, మనస్సు, ఇంద్రియాలు, ప్రాణం, జ్ఞానం అయితే అన్ని కార్యాల వెనుక వున్న ప్రధాన పాత్ర మనస్సుదే. దానికై తీసుకోవాల్సిన సంకల్పాలు ఇవే

1.    సరైన మార్గంలో సత్యాన్ని చేరే వరకు అలసిపోకుండా విశ్వాసాన్ని చెదరనీకుండా నా మనస్సు నిలకడగా ఉండుగాక.

2.   నా మనస్సు తప్పుడు భావనల నుంచి విడుదలై, వివేకము కలదై నాలో నిబిడీకృతమైన శుద్ధ చైతన్యాన్ని తెలుసుకోగాక

3.  గురువుల నుంచి తెలుసుకున్నటువంటి ప్రజ్ఞానము నేను శ్రవణ, మనన నిధి ధ్యాసల ద్వారా పటిష్టపరచుకొని జీవితంలో ఎదురయ్యే అనేక పరిస్థితులు నుండి బయటపడే సాత్త్విక ధృతి పట్టుదల ఓర్పులను ప్రసాదించుగాక!

అన్ని కార్యకలాపాలను అత్యంత జాగరూకతతో ఆచరించి చర్యారహితంగా వీటి వెనుక వుండేఆత్మనుతెలుసుకోవడానికి నా మనస్సుని బాగా ఉపయోగించుకుందును గాక!

 

శ్రీమతి చన్నాప్రగడ జయలక్ష్మి

Published by G.S.R Impressions RAJAMAHENDRI Dated 1st March 2017

Comments

  1. చాలా బాగా వినిపించారు, ధన్యవాదములు🙏

    ReplyDelete

Post a Comment

Popular Posts