దివ్య మానసమ్ (Part-7)
You can Listen to this Article in the above Audio
దివ్య మానసమ్
(Part-7)
శివ సంకల్ప సూక్తమ్
మంత్రం : 6
సుసారధి రశ్వానివ
యన్మనుష్యాన్
నేనీయతే భీశుభి
ర్వాజిన ఇవ
హృత్ ప్రతిష్టం
యదజిరం జవిష్టం
తన్మే మనః శివసంకల్ప
మస్తు.
అత్యంత సామర్థ్యం కలిగిన రథసారధి
తన గుర్రాలను అదుపులో వుంచగలిగినట్లు, ఏ మనస్పైతే అన్ని జీవరాసుల చైతన్యానికీ సారధ్యం
వహిస్తోందో, మార్గ నిర్దేశకత్వం అవుతోందో, అతి సనాతనమైనదీ, నిత్యనూతనమైనది, వేగవంతమైనదీ
అయినటువంటి నా మనస్సులో సత్సంకల్పాలు కలుగుగాక!
ఏ ప్రయాణానికైనా
తేలికపాటు బరువులు, ముందుగా
వెళ్ళవలసిన మార్గము పట్ల స్పష్టత, చిన్నపాటి అసౌకర్యాలకు, అడ్డంకులకు విచారించకుండా,
చలించని మనస్సు ముఖ్యం. అప్పుడే ప్రయాణపు అనుభవాన్ని ఆనందంగా ఆస్వాదిస్తాము. ఉత్సాహంగా
మొదలు పెట్టిన ప్రయాణాన్ని ఓర్పుగా గమ్యంచేరే దాకా చిరునవ్వుతో కొన సాగించాలి. అందుకు
జ్ఞానులైన సహ ప్రయాణికులు, సరియైన మంచి వాహనం చాలా అవసరం.
మన జీవిత ప్రయాణంలో మన శరీరమే
వాహనం. నేను అనబడే మనిషే దాని యజమాని. తన వివేకము అనే తాళ్ళతో ఇంద్రియాలనబడే గుర్రాలను
ప్రపంచపు ఆకర్షణల మధ్య, ప్రలోభాలనే రహదారిపైనే ప్రయాణించవలసి వుంటుంది. వాహనం మన ఆధీనంలో
వున్నప్పుడే వాహనాన్ని నడిపే ఆనందం ఉల్లాసం ఉంటాయి.
ఎన్నో సందేహాలు, తప్పుడు సలహాలు
మనలను దారి మళ్ళించ చూసినా శిక్షణ పొందిన గుర్రాల వలె క్రమశిక్షణ కల్గిన ఇంద్రియాలైప్పుడూ,
వేగంగా వెళ్తున్నా నియంత్రణ కోల్పోకుండా క్షేమంగా గమ్యాన్ని చేరగలుగుతుంది. జ్ఞానముతో చేసే జీవనయానం ఎంతో ఉల్లాసభరితంగా సాగుతుంది
మనసుకున్న మరో గొప్పవరం చురుకుదనం.
దానికి శరీరపు వయస్సుతో పనేలేదు. తులసీదాస్
వంటి మహనీయులు రామచరిత మానసమును తన ఎనభైవ యొక్క
దశకంలో రచించారంటే మనస్సు శక్తిని మనం అర్థం చేసుకోవచ్చు
మన గమ్యం అంటే, మనలోనే వున్న
అవధులు లేని ఆనందాన్ని కనుగొనడం. దానికి మన మనస్సనే సారధి ఎల్లప్పుడూ నిత్యయవ్వనంతో
చురుకుగా వుండాలి.
సృష్టిలోని పంచభూతాల సహాయంతోనే
మన పాంచభౌతిక శరీరమూ నడగవగలుగుతుంది. మనం ఈ సృష్టిలో అంతర్భాగులం. అది మరచి ఏదో ప్రత్యేకతను
వేరుగా ఆపాదించుకోవడం తోనే సమస్య మొదలుపుతోంది. అందుకే ఈ చిట్టచివరి మంత్రం సూచించేది
ఏమంటే “నా మనస్సు భగవంతుని మనస్సులా మారుగాక” అని
సంకల్పించకోమని, భగవంతుని మనస్సు అనే పూర్ణ చైతన్యానికి రాగద్వేషాలు లేనే లేవు. పక్షపాతం
ప్రసక్తే లేదు
భగవానుడు గీతలో సమ్మోహం సర్వ భూతేషు (9
అధ్యాయం, 29వ శ్లోకం)
"నాకు ప్రియులు
అప్రియులు లేరు. నన్ను అత్యంత భక్తితో ఆరాధించేవారు నాలో, నేను వారిలో వుంటాం." పూర్ణ చైతన్యానికి పక్షపాతము లేకపోవడమే కాక తనకంటూ ఇష్టాయిష్టాలు
వుండవు. కానీ వ్యక్తి చైతన్యం ఎన్నో బలహీనతలతో రాగద్వేషాల మయంగా వుంటుంది.
భగవంతుడు అందరి హృదయాలలో నివసిస్తూ
తన మాయచేత అందరినీ నియంత్రిస్తూ ఉంటాడు. తన కరుణతో మనలను కాపాడుతూనే వుంటాడు.
బాల్యంలో జీవితమంటే
ఓవింత
ఒడిదుడుకులను ఎదుర్కొనే
సమయంలో అది ఓ పిడుగుపాటు
వివేకము పొందినప్పుడు
అది ఒక శరణాగతి
ఆ పూర్ణచైతన్యం ఎటు తీసుకు
వెళ్తే అటు వెళ్ళేదే మనలోని చైతన్యం.
ఇక్కడ మననం చేసుకోవాల్సిన సంకల్పాలు:
1. నా మనస్సు కూడా శరీర ఆయుః ప్రమాణంతో నిమిత్తం లేకుండా నిత్యనూతనంగా చురుకుగా వుండుగాక!
2. నా ఈ ఆధ్యాత్మిక మార్గంలో నాకు సరి అయిన సహచరులుగా సద్దురువు నద్ధంధాలు తోడ్పడుగాక!
3. అర్జునునికి మలెనే నాకూ, నా జీవితానికి భగవంతుడే చుక్కానిగా, రధసారధిగా, సలహాదారుగా, ఆత్మీయ సహచరుడిగా ఉండుగాక!
భగవంతుడే మన సారధి అయినప్పుడు
మన మార్గం గురించీ గమ్యం గురించీ విచారించవలసిన పనేలేదు. ఆయన సారధ్యానికి అవరోధం కలిగించే
మన పాపకర్మలను మనం నిర్మూలం చేసుకోవాలి. దానికి భగవంతుడు మన నుంచి అభిలషించేది ఒకటే.
అది ఆయన వద్ద లేనిది. అదే మన అహంకారం. అందరికన్నా గొప్పవారం అనే అహంకారాన్ని ఆయన చరణాల వద్ద
వుంచి శరణాగతి కోరుదాం
దేవుడా! నీ సంకల్పమే మమ్మల్ని నడిపించేది. నిన్ను హృదయపూర్వకంగా
సర్వస్య శరణాగతి కోరుకుంటున్నాను. నీ ఇచ్ఛే నా సంకల్పం
అదే నా మార్గము
God's will is
my way.
త్వం హి నో నేతా
త్వంహి నోదాతా
యత్ర త్వం నయసి
తత్ర గచ్చామః
మన మనస్సు ఆయన నియంత్రణలో వుండి
ఆయన కోరుకున్న వైపే పయనించుగాక! మంచితనం శుభకరము మాత్రమే నిలిచి వుండుగాక. దేవుని దయ
మనకు పరమశాంతిని ప్రసాదించి అమరధామమునకు ఖచ్చితంగా చేర్చగలదు.
తన్మే మనః శివ సంకల్పమస్తు
లోకాస్సమస్తాత్ సుఖినో భవన్తు
ఓం శాంతి
శాంతి
శాంతిః
***********************************************************************************************
నా బెంగుళూరు నివాసంలో ఆధ్యాత్మిక
వికాసంలో చిన్నయా మిషన్ ప్రధాన పాత్ర అయ్యింది. పూజ్యగురు స్వామి తేజోమయానంద
ముఖతః శివసంకల్పసూక్తమ్ ప్రసంగాలు వినగలిగే
అద్భుత అవకాశం లభించింది.
దేశ దేశాలలోనూ తన ప్రసంగాలతో
ఉత్తేజపరచిన స్వామి వివేకానంద. తాను స్వంతంగా కొత్తగా చెప్పినది ఏమీ లేదని, అన్నీ ఉపనిషత్తులలో
నిక్షిప్తమైనవేనని ఉత్కంటించారు.
అదే విధంగా స్వామి తేజోమయానందగారి
శివసంకల్పసూక్తమ్ ప్రసంగాలు, మరియు దానిపై వారు రచించిన ఆంగ్ల భాష్యం ఆధారంగా ప్రేరణతో
వ్రాసినదే ఈ దివ్య మానసమ్. స్వామి తేజోమయానందగారి దివ్యచరణాలకు నా కృతజ్ఞతా పూర్వక
ప్రమాణాలు. నా అవగాహనా రాహిత్యం వలన ఏమైనా తప్పుగా తేడాగా విశ్లేషిస్తే అందుకు క్షంతవ్యురాలిని.
పూర్తి బాధ్యత నాదే.
మా అక్క శ్రీమతి నాగసుభద్ర,
బావగారు శ్రీ ఆనందరావు శ్రీనివాస్ గార్ల షష్ట్యబ్ది సందర్భంగా ప్రేమ, గౌరవ పురస్కారంగా
చిరు కానుకగా 2017 లో నేను చేసిన తొలిప్రయత్నం ఈ సాహసం.
నా ఆలోచనల ప్రతిబింబాలకు ఇంత
అందమైన కూర్పు, పుస్తకరూపు ఇచ్చిన అన్నయ్య శ్రీ నల్లగొండ రవిప్రకాష్ కు నా కృతజ్ఞతాపూర్వక
నమస్సుమాంజలులు.🙏🏻💐
శ్రీమతి చన్నాప్రగడ జయలక్ష్మి
Published by G.S.R Impressions RAJAMAHENDRI Dated 1st March 2017



Comments
Post a Comment