ఐంద్ర "జయఘోష"


You can Listen to this Kavitha in the above Audio

ఐంద్ర "జయఘోష" 


 
ఆమ్లజని తీసుకుని కర్బనాన్ని వదిలే ఊపిరితిత్తులకు ఆధారం మన వాతావరణం

సస్యశ్యామలమైన హరితోద్యానము లతో స్వచ్ఛమైన వాయువులతో నాసిక పై జయం

 

ఆహార సారాన్ని గ్రహించి వ్యర్థాలను సులభంగా నెట్టడానికి కారణం మన అభిరుచులు

 జిహ్వను గెలిస్తే సర్వం మన వశం

 వాక్కు ని నియంత్రిస్తే మన నోటి పై విజయం

 

హృదయ ఘోషను వీనుల విందుగా ఉంచాలంటే చేయాల్సింది మన భావాలపై నియంత్రణ

వేటికీ చలించని స్థితప్రజ్ఞతే వినికిడి పై మ్రోగించేజయభేరి

 

అపురూప దృశ్యాలతో నయనద్వయ కెమెరా మెమరీ నిండాలంటే

దృష్టినినిలపాలిసింది మన పరిసరాల జాగృతి పై

 సానుభూతి సాంగత్యంతో నీ చూపు పై గెలుపు

 

అద్భుతమైన ఆమేయమైన ఎన్నో యంత్ర రాజాలను కప్పివుంచే చర్మ సాధనం,

మనం దానికి ధర్మకర్తలం మాత్రమే అన్న  వైరాగ్యరుధిరంతో ఆరోగ్య తరంగాలను శరీరమంతా ప్రవహింప చేస్తే, లభించే అఖండ సార్వభౌమత్వం

 

ఇన్ని జయ పరంపరలతో అహంకారానికి పోక, మనస్సు బుద్ధిమంతుడైన విద్యార్థి లా విధేయంగా ఉంటే,

ఆరింటి సాక్షిగా నవోదయం

ఆరు ఋతువుల మన ప్లవ నామ సంవత్సర ఉషోదయం

మనల్ని భవసాగరాన్ని దాటించే ఆహ్లాద తెప్పోత్సవం . 🚣

 


 జయలక్ష్మి చన్నాప్రగడ

 బెంగుళూరు

  మనవి : పంచేంద్రియాలు అంటే పైకి కనిపించే రంధ్రాలు గోళాలు మాత్రమే కాదు . కవితను సరదాగా తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను 🙏

శ్రీమతి చన్నాప్రగడ జయలక్ష్మి

బెంగుళూరు

Published in SAMACHARAM - Telugu Daily Paper From RAJAMAHENDRI 

Dated 13th April 2021 – Plava Naama Ugadi

Comments

Popular Posts