షడ్రుచుల జీవన దర్పణం

You can Listen to this Kavitha in the above Audio.

షడ్రుచుల జీవన దర్పణం


కిలకిలమని నవ్వుతూ

చెట్టాపట్టాలేసుకుని 

పరుగులు తీసే

 'మధురమైన'  కాకి ఎంగిలి  ' బెల్లమే ' 'బాల్యం' 


 కాలం కొలమానాలనే

కబుర్లతో  ఏమార్చే 

స్నేహం-ప్రేమ వంటి

 'వగరైన' 'మావిపిందెల'  పొగరు  'కౌమారం' 


చిలిపి కలహాల 

చిరు అలకలతో సాగే 

'కటువైన' ' మిర్చీ ' రోషాలతో 

సాగేదే  కొత్త కాపురాల 'యవ్వనం' 


పిల్లల ముద్దు ముచ్చట్లనే 

మందహాస మునుగులో

 'పుల్లటి ' బాధ్యతల సంసార రథాన్ని 

లాగించే 'చింతల' 'ప్రాఢం' 


అవగాహన-సర్దుబాట్లు అనేవి 

'లవ' లేశంగా తోచినా 

ఒకరికి ఒకరు ఆలంబనైన 

జీవన 'రుచి' 'నడివయసుదనం'' 


మొహమాటపడ్తూ తొంగిచూసే 

వెండి జరీపోగుల తళుక్కులతో

 'చేదు' గా వున్నా వేసవి 'వేప' చల్లదనంతో 

మురిపించే మనుమలతో  'ముదితనం' 


ఇదండీ మన షడ్రుచుల జీవనయానం 

సృష్టిలో దేని ప్రత్యేకత దానిదే 

రుచి అయినా జీవన దశ అయినా.

 అన్నింటినీ కలిపే ఆస్వాదిద్దాం 

విశిష్టతకు విళంబి లో పెద్ధపీట వేద్దాం

 వసంత రాత్రులతో సీతారాములను స్వాగతిద్దాం.


చన్నా ప్రగడ (గంధం) జయలక్ష్మీచంద్రశేఖర్


UGADI Series Part - 2

Published in SAMACHARAM - Telugu Daily Paper From RAJAMAHENDRI Dated 18th March 2018

Comments

Popular Posts